News April 29, 2024
గుంటూరులో మే 1న చంద్రబాబు ప్రచారం

గుంటూరు నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌లు తెలిపారు. గుంటూరులో వారు మాట్లాడుతూ.. మే 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Similar News
News September 11, 2025
గుంటూరు జిల్లా కలెక్టర్ నేపథ్యమిదే

తమీమ్ అన్సారియ IAS 2015 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన డైనమిక్ ఇండియన్ IAS అధికారిణి. ఆమె డిసెంబర్ 31, 1998 న తమిళనాడులో జన్మించారు. కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ మేనేజ్మెంట్లో బలమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె 2014లో 17 సంవత్సరాల వయసులో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 314 ర్యాంక్ సాధించారు. ఆమె భర్త డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ కూడా ఐఏఎస్ అధికారి.
News September 11, 2025
ANUలో ఈ నెల 17న క్విజ్ పోటీలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 17న క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ తెలిపారు. మొదటి మూడు స్థానాలకు వరుసగా రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.3 వేల నగదు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.
News September 11, 2025
AP CRDAకు అవార్డు

APCRDAకు GIS, RSA రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ టెక్నాలజీల వినియోగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన Best User Organization అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన Esri India సంస్థ వార్షిక యూజర్ కాన్ఫరెన్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజేంద్ర కుమార్ ఈ అవార్డును అందజేశారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీని సృజనాత్మకతో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు లభించింది.