News October 25, 2024
గుంటూరులో రేపు జాబ్ మేళా
గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రమాదేవి తెలిపారు. CREDRIGHT FINANCE, SBI CREDIT CARDS, DAIKIN, SMART KIDS కంపెనీలు ఇందులో పాల్గొంటాయని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ చదివిన 18-35 సంవత్సరాల వారు అర్హులని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటర్వ్యూ జరుగుతుందని, సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలని చెప్పారు. Shareit
Similar News
News November 22, 2024
శాంతిభద్రతల ఏఎస్పీ రవికుమార్ బాధ్యతల స్వీకరణ
గుంటూరు జిల్లా శాంతి భద్రతల విభాగ ఏఎస్పీగా రవికుమార్ శుక్రవారం బాధ్యత స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ప.గో జిల్లా ఏఎస్పీగా ఉన్న రవికుమార్ గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మెక్కను అందించారు. జిల్లాలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
News November 22, 2024
గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాస్ ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయి శ్రీనివాస్ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2024
మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
మంత్రి నారా లోకేశ్‌ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై మంగళగిరి పట్టణ పోలీసు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గత నెల 21వ తేదీన ఐ.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరీముల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.