News March 25, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం క్షతగాత్రులను  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని క్షతగాత్రుల వివరాలు తెలియాల్సిఉందని పోలీసులు తెలిపారు.

Similar News

News October 6, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో రూ.84.97కోట్లు

image

పీఎం కిసాన్ పథకం కింద ఉమ్మడి గుంటూరు జిల్లాకు రూ.84.97కోట్లు వచ్చాయి. ఈ మేరకు సదరు నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ పథకం కింద గుంటూరు జిల్లాలోని 86,674 మంది రైతులకు రూ.17.33కోట్లు, పల్నాడు జిల్లాలో1,97,639 మంది రైతులకు రూ.39.53కోట్లు, బాపట్ల జిల్లాలో1,40,559 మంది రైతులకు రూ.28.11కోట్లు చొప్పున కేంద్రం జమ చేసింది.

News October 6, 2024

గుంటూరు: కానిస్టేబుల్ అని బెదిరించి లైంగిక దాడి

image

పోలీసు కానిస్టేబుల్‌ అని ఓ విద్యార్థినిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట CI వీరయ్య వివరాల మేరకు.. ఇద్దరూ ప్రేమికులు బస్టాండ్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో ఓ వ్యక్తి వారిని ఆపాడు. తాను కానిస్టేబుల్‌ని అని.. ఎక్కడికి వెళ్తున్నారని వారిని బెదిరించి స్టేషన్‌కు రావాలన్నాడు. అనంతరం ఆ విద్యార్థినిని వాహనంపై తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

News October 6, 2024

యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలి: అనిత

image

మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు (రామ)రాజుని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని అనిత కోరారు.