News March 19, 2024
గుంటూరులో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

గుంటూరులో లాడ్జిలపై సోమవారం కొత్తపేట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ అన్వర్ బాషా తెలిపిన వివరాల మేరకు.. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎస్పీ తుషార్, ఏఎస్పీ షెల్కే ఆదేశాలతో రైలుపేట ఆర్టీసీ బస్టాండ్, గుంటూరు తోట తదితర ప్రాంతాల్లోని లాడ్జిలపై తనిఖీలు నిర్వహించామన్నారు. వ్యభిచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
Similar News
News September 3, 2025
అరుదైన కవయిత్రి కాంచనపల్లి కనకమ్మ

సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ సెప్టెంబరు 3, 1893లో ఉమ్మడి గుంటూరు జిల్లా దుర్గిలో జన్మించారు. బాల్యవితంతువైన కనకమ్మ BA ఆంగ్లంలో డిగ్రీ పొంది కొంతకాలం కళాశాలలో పనిచేశారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. అనేక సంస్కృత నాటకాలను ఆంధ్రీకరించారు. వీరి కృషికి గుర్తింపుగా ‘కవితా విశారద’, ‘కవితిలక’ అనే బిరుదులు, కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు.
News September 2, 2025
మేరికపూడిలో విషాదం.. తండ్రీకొడుకుల దుర్మరణం

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికులను కంటతడి పెట్టించింది.
News September 2, 2025
తెనాలిలో 108 మంది వీణ కళాకారులతో సంగీత ఉత్సవం

తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన వీణ సంగీత ఉత్సవం జరుగనుంది. మూలా నక్షత్రం సందర్భంగా చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఆరోజు సాయంత్రం 5.15 గంటలకు సంగీత ఉత్సవం ప్రారంభమవుతుందని పెనుగొండ శ్రీ వాసవి క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 108 మంది వీణ కళాకారులతో తెనాలిలో తొలిసారిగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.