News March 11, 2025
గుంటూరులో వ్యక్తి కిడ్నాప్

లాడ్జిలో వివాహితతో కలిసి ఉన్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి అతణ్ని కిడ్నాప్ చేశారు. లాడ్జి మేనేజర్ తిరుపతి ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల కథనం.. జిన్నాటవర్ సెంటర్లోని బాలాజీ లాడ్జిలో రామలింగేశ్వరరావు అనే వ్యక్తి ఓ వివాహితతో రూమ్ తీసుకున్నాడు. నలుగురు వ్యక్తులు వచ్చి రామలింగేశ్వరరావుపై దాడి చేసి అతణ్ని తీసుకెళ్లారని తెలిపారు.
Similar News
News March 11, 2025
సీఆర్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

వెలగపూడిలోని అసెంబ్లీలోని ఛాంబర్లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు విషయాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పొంగూరు నారాయణ, కేశవ్ పయ్యావుల, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News March 11, 2025
GNT : లాడ్జిలో కిడ్నాప్, హత్యాయత్నం .. కారణమిదే.!

గుంటూరులోని లాడ్జిలో వ్యక్తిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు వివాహేతర సంబంధంమే కారణమని తెలుస్తోంది. మప్పాళ్లలోని చాగంటివారిపాలెం వాసి రామలింగేశ్వరరావు అదే ప్రాంత మహిళతో సంబంధం ఉంది. సోమవారం అతను మహిళతో లాడ్జిలో ఉండగా .. గమనించిన బంధువులు ఫాలో చేసి పట్టుకుని కొట్టి తీసుకెళ్లారు. లాలాపేట పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
News March 11, 2025
గుంటూరు: జీబీఎస్ కలకలం.. 3కు చేరిన మృతులు

గుంటూరులో జీబీఎస్ మరణాల సంఖ్య మూడుకు చేరింది. పల్నాడు జిల్లా మాదలకు చెందిన సీతామహాలక్ష్మి (50) ఈనెల 5న జీజీహెచ్ లో చేరారు. కాగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.