News April 5, 2025

గుంటూరులో సిటీ బస్సుకు నిప్పంటించిన దుండగులు

image

బృందావన్ గార్డెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ఓ ఘ‌ట‌న కలకలం రేపింది. ఆటలాడుకుంటూ వేంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చిన ఇద్దరు మైనర్లు పార్కింగ్‌లో ఉన్న సిటీ బస్సులోకి ఎక్కి ఇంజిన్ ఆయిల్ పోసి నిప్పంటించడంతో బస్సు కాలిపోయింది. మంటలు పక్కనే ఉన్న మరో బస్సును కూడా తాకాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పట్టాభిపురం పోలీసులు, నిప్పంటించిన మైనర్లను గుర్తించారు.

Similar News

News April 5, 2025

గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ పనులు వేగవంతం

image

గుంటూరు-గుంతకల్లు మధ్య 2వ రైలు మార్గం పనులు 347కి.మీ పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 401 కి.మీ మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ.3,631 కోట్లు భరిస్తామని ఐదేళ్ళ క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తైతే ఈ మార్గంలో నడిచే రైళ్ళకు గంటన్నర సమయం ఆదా అవుతుందని అంటున్నారు. 

News April 5, 2025

మంగళగిరి: అఘోరీ ఉచ్చు నుంచి బయటపడిన శ్రీవర్షిణి

image

అఘోరీ చేతుల్లో నుంచి మంగళగిరి యువతి శ్రీవర్షిణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. నెల రోజుల క్రితం శ్రీవర్షిణి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన లేడీ అఘోరీ, మాయమాటలతో ఆమెను వశం చేసుకుని గుజరాత్‌కు తీసుకెళ్లింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు గుజరాత్‌ వరకు వెళ్లింది. అక్కడ అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News April 5, 2025

విడదల రజినికి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం: అడ్వకేట్ జనరల్

image

స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజని తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.

error: Content is protected !!