News October 16, 2025

గుంటూరులో సినీనటులపై NSUI ఫిర్యాదు !

image

తెలుగు సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్, హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ పై NSUI గుంటూరు బృందం లాలాపేట స్టేషన్లో ఫిర్యాదు చేసింది. NSUI జిల్లా అధ్యక్షుడు కరీమ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పై వారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశామని అన్నారు.

Similar News

News October 16, 2025

గుంటూరు మిర్చి యార్డులో ధరలు..

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం లక్ష క్వింటాళ్ల AC సరుకు అమ్మకానికి వచ్చింది. రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు ధరలు ఇలా ఉన్నాయి. తేజా, 355, 2043 రకాలు: కేజీ ₹100 నుంచి ₹160 వరకు పలికాయి. యల్లో రకం: అత్యధికంగా కేజీ ₹200 నుంచి ₹230 వరకు పలికింది. నెంబర్ 5, DD రకాలు: కేజీ ₹110 – ₹155 మధ్య ఉన్నాయి. మీడియం సీడ్ రకాలు ₹80 – ₹100, బుల్లెట్ రకాలు ₹90 – ₹145 మధ్య ట్రేడ్ అయ్యాయి.

News October 16, 2025

దుగ్గిరాల వైసీపీ జెడ్పీటీసీ భర్త అరెస్ట్ ?

image

దుగ్గిరాల మండలం వైసీపీ జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త వీరయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన భార్య అరుణ ఆరోపించారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న తన భర్తను అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారని అన్నారు. తాడేపల్లి స్టేషన్‌కు తరలిస్తున్నామని చెప్పారని.. కానీ తన భర్త అక్కడ లేదని అరుణ ఆరోపించారు. ఈ మేరకు తన భర్త ఆచూకీ చెప్పాలని తాడేపల్లి ఠాణాలో గురువారం ఫిర్యాదు చేశారు.

News October 16, 2025

తెనాలి: మహిళతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి జరిమానా

image

మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడికి రూ. 2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామానికి చెందిన మహిళ పట్ల ఆమె బావ వెంకట సుబ్బారావు 2021లో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో దాఖలైన చార్జ్‌షీట్‌పై విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చారు.