News February 24, 2025
గుంటూరులో 91 శాతం ప్రజెంట్ పోల్

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 8,673 మంది అభ్యర్థులు పరీక్షలకు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో మొదటి పరీక్ష 7,927 మంది రాయగా.. రెండవ పరీక్షకు 7,920 మంది హాజరయ్యారు. మొత్తం 91 శాతం హాజరు పోల్ అయింది. కాగా గ్రూప్-2 మెయిన్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,277 మంది క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 24, 2025
3 పతకాలతో సత్తాచాటిన పవర్ లిఫ్టర్ చంద్రిక

ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సీనియర్ నేషనల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టర్ బొలినేని చంద్రిక 84 కేజీల విభాగంలో 3 పతకాలు సాధించింది. పతకాలు సాధించిన చంద్రికను ఆమె కోచ్ నరేంద్ర రాజుని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ వంశీకష్ణ, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అభినందించారు.
News February 24, 2025
నంబూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్‌హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. నంబూరు గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. తమ సిబ్బందితో కలిసి ఆ స్థావరంపై దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకొని రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
News February 23, 2025
ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

ఏమ్మెల్సీ ఎన్నికలు సజావుగా కొనసాగేలా ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఏమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు.