News January 9, 2026
గుంటూరులో MDMA మత్తు పదార్థాల పట్టివేత

గంజాయి, MDMA మత్తు పదార్థాలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.
Similar News
News February 21, 2026
GNT: మెడికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 28 వరకు పొడిగింపు

గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్‌ను ప్రజల విజ్ఞప్తితో ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఇకపై మరింత గడువు లేదని ప్రిన్సిపల్ డా. సుందరాచారి స్పష్టం చేశారు. వేలాది మంది ఇప్పటికే సందర్శించారు. ఎండల దృష్ట్యా తాగునీరు, శౌచాలయాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ యువతి ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించడం ఆకట్టుకుంది.
News February 21, 2026
GNT: విభిన్న ప్రతిభావంతులకు ముఖ్య గమనిక

గుంటూరు జిల్లాలో 3 చక్రాల స్కూటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న శారీరక విభిన్న ప్రతిభావంతుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 25న జరగనుంది. బృందావన్ గార్డెన్స్ 1వ లైనులో ఉదయం 10గంటల నుంచి ఎంపిక కమిటీ ద్వారా ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు N వెంకరమణప్ప తెలిపారు. దరఖాస్తు చేసుకొని ఉన్న విభిన్న ప్రతిభావంతులు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు.
News February 20, 2026
అమరావతికి సిద్ధం కానున్న అసలైన మణిహారం

అమరావతికి అసలైన మణిహారం సిద్ధమవుతోంది. రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. మొత్తం 96.2 కిలోమీటర్ల పొడవుతో, 75 మీటర్ల భారీ వెడల్పుతో ఈ రహదారిని డిజైన్ చేశారు. ఇది 8+4 వరుసల (Lanes) కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. అంటే ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉంటే, స్థానిక రవాణా కోసం అధనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లు ఉంటాయి.


