News January 16, 2025
గుంటూరు: అత్తగారింట్లో 200 రకాల పిండి వంటలతో విందు

గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌కు మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు. దీంతో వారు బుధవారం మెుగల్తూరులో కొత్త అల్లుడు వైష్ణవ్‌కు 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.
Similar News
News February 18, 2026
మంగళగిరి-తెనాలి రోడ్డు విస్తరణ

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్‌కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.
News February 17, 2026
ఉగాది నాటికి గృహ నిర్మాణాలే లక్ష్యం: కలెక్టర్

ఉగాది నాటికి నిర్దేశిత గృహ లక్ష్యాలు పూర్తిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనులపై కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, MPDOలతో కలెక్టర్ వీసీ నిర్వహించారు. జిల్లాలో 22,952 గృహాలు పూర్తి చేయాలని అన్నారు. దీనిని పూర్తి చేయుటకు మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు శ్రద్ధ పెట్టాలన్నారు.
News February 17, 2026
GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.


