News August 13, 2025

గుంటూరు: అత్యాచారయత్నం కేసులో 5 ఏళ్ల జైలు

image

2020 ఫిబ్రవరి 4న ఐనవోలు గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం, అక్రమ ప్రవేశం చేసిన కేసులో నులకపేటకి చెందిన బలిమి తిరుపతి రావు(60)పై కేసు నమోదైంది. విచారణ పూర్తి చేసిన గుంటూరు IV అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి-ఎస్సీ/ఎస్టీ కోర్టు ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1,200 జరిమానా విధించింది. తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో నిందితుడికి శిక్ష పడేలా చేశారు.

Similar News

News August 13, 2025

వచ్చే నెల ట్రంప్‌‌తో మోదీ భేటీ?

image

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్‌‌‌లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్‌‌లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్‌పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.

News August 13, 2025

HYDలో వాట్సాప్ ద్వారా బస్ టికెట్

image

HYD‌లోని ఆర్టీసీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ డిజిటల్ టికెటింగ్ సక్సెస్ అయిన నేపథ్యంలో వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా టికెట్ అందించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. మియాపూర్, కంటోన్మెంట్ డిపోల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం నడిపే పుష్పక్ బస్సుల్లో మొదట పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసి పరిశీలించనున్నారు. ఇది సక్సెస్ అయితే సిటీలోని మిగతా బస్సులకు సైతం విస్తరించనున్నారు.