News June 14, 2024

గుంటూరు: అప్పుల బాధలు తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధలు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చిర్రావూరు గ్రామానికి చెందిన ప్రకాశ్ రావు (54) అప్పుల బాధలు గురువారం సాయంత్రం గడ్డి మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి మరణించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 5, 2025

GNT: ‘కపాస్ కిసాన్’ యాప్‌ ద్వారా సీసీఐకి విక్రయించాలి

image

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్‌ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్‌లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.

News November 5, 2025

సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

image

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్‌ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్‌ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.

News November 5, 2025

మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

image

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.