News December 20, 2024

గుంటూరు: ‘ఆ బాధ్యత మనందరిపై ఉంది’ 

image

విద్యుచ్ఛక్తిని పొదుపుగా వాడి భావితరాల వారికి ఇంధన వనరులను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. గురువారం, కలెక్టరేట్లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విద్యుచ్ఛక్తి ఆదాలో ప్రజలందరూ భాగ్యస్వామ్యం కావాల్సి ఉందన్నారు. 

Similar News

News February 22, 2026

GNT: కాంగ్రెస్ తీరుపై అంబటి తీవ్ర విమర్శలు

image

YSR మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వేధించిందని అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ కక్షతోనే జగన్‌పై CBI, EDఅక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు YSRవారసత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీపడలేదన్నారు. విదేశీ గడ్డపై దేశ పరువు తీయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుతో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసన్నారు.

News February 22, 2026

నేడు గుంటూరుకు CMచంద్రబాబు రాక

image

గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సొసైటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అతిథులు తపాలా సేవా మూర్తులకు సన్మానం చేయనున్నారు.

News February 22, 2026

ఫిరంగిపురం: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి మృతి

image

ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని రైస్ మిల్లు వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన బైక్‌పై వెళ్తుండగా రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రభుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు.