News June 2, 2024
గుంటూరు: ఇంజినీరింగ్ పనులు.. పలు రైళ్ల రద్దు

గుంటూరు-కేసీ కెనాల్ మధ్య ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. విజయవాడ-గుంటూరు(07464), గుంటూరు-విజయవాడ (07465), గుంటూరు-విజయవాడ(07976), హుబ్బళి-విజయవాడ(17329) రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News April 24, 2025
పొన్నూరు: వీరయ్య చౌదరి హత్య కేసులో అదుపులోకి ఐదుగురు

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తులో ఓ కీలక మలుపు తిరిగింది. బుధవారం పోలీసులు పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సంబంధం ఉన్నవారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఇదే మాఫియా గతంలో మరో వ్యాపారిని హత్య చేసిన రికార్డు ఉందని సమాచారం. ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను ఒంగోలు తరలించి విచారణ చేపట్టారు.
News April 24, 2025
జాబ్ కోసం తిరుగుతున్నారా? గుంటూరులోనే మీకు గోల్డెన్ ఛాన్స్!

గుజ్జనగుండ్లలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 25న జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ సంస్థలు ఉద్యోగుల నియామకానికి ముందుకొస్తుండగా, పదోతరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి మంగళవారం తెలిపారు. తమ బయోడేటా, విద్యాసర్టిఫికెట్లు, ఆధార్, ఫోటోతో రావాలని ఆమె సూచిస్తున్నారు.
News April 24, 2025
తెనాలి జిలేబికి ప్రత్యేక గుర్తింపు

తెనాలి జిలేబికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 19వ శతాబ్దం చివరలో మొదలైన దీని తయారీని సుబ్బయ్య ఆధునిక రూపానికి తెచ్చారు. 1965లో తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఆయన ప్రారంభించడంతో ఈ ప్రాంతం ‘జిలేబి కొట్టు బజారు’గా మారింది. సాధారణ జిలేబిలకు భిన్నంగా, తెనాలి జిలేబిలో బెల్లం పాకం వాడతారు. దీనివల్ల ప్రత్యేక రుచి, ముదురు రంగు, సువాసన వస్తాయి. ఈ ప్రత్యేకతే తెనాలి జిలేబిని ప్రసిద్ధి చేసింది.