News April 18, 2024

గుంటూరు: కాలువలో మునిగి విద్యార్థి మృతి

image

తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కొమ్మమూరు కాలువలో మునిగి విద్యార్థి మృతిచెందాడు. నర్సరావుపేటకు చెందిన వంశీకృష్ణ వడ్లమూడిలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తాను మరో ముగ్గురితో కలసి సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి దేవస్థానం వద్ద కాల్వకు బుధవారం సాయంత్రం వెళ్లారు. ఈత కొడుతుండగా.. వంశీకృష్ణ మునిగిపోగా.. రాత్రికి మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Similar News

News April 20, 2025

అమరావతి ప్రధాని పర్యటనకు స్పెషల్ అధికారుల నియామకం

image

ప్రధాని పర్యటనలో విధులు నిర్వహించేందుకు 31 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసే బాధ్యత వారిదే . రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి.వీరపాండియన్ ఉన్నారు. పీఎంవో, ఎస్పీజీ, సీఎంవోలతో సమన్వయం చేసుకోటానికి శాంతిభద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ప్రధాని రోడ్, బహిరంగ సభ, వీఐపీల బాధ్యతలు అప్పగిస్తూ ఆయనకు ఆదేశాలిచ్చారు.

News April 20, 2025

‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

image

ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్‌లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ.. త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.

News April 20, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

image

గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ వర్క్షాప్‌లో కలెక్టర్ నాగలక్ష్మి భూ సమస్యలపై కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి ఎక్కువగా భూ రికార్డుల, వెబ్‌ల్యాండ్ లోపాల, రీసర్వే అంశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధికారులు త్వరగా గుర్తించి పరిష్కరించకపోతే ప్రజలు విసుగుతో అధికార కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అధికారుల సమన్వయం వల్లే సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయన్నారు.

error: Content is protected !!