News April 7, 2025
గుంటూరు: కుక్కల దాడిలో చిన్నారి మృతి.. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

స్వర్ణభారతీనగర్‌లో కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కుక్కల సమస్యపై గళమెత్తినా అధికారులు తాత్కాలికంగా చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఐజక్ ఆత్మకు శాంతి చేకూరాలని, అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణ పై దృష్టి సారించాలని అన్నారు.
Similar News
News April 9, 2025
గుంటూరు: భార్య కోసం భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛార్లెస్ (52) ప్రతిరోజూ ఇంటికి మద్యం తాగి వస్తుండటంతో కుటుంబంలో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఛార్లెస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News April 9, 2025
గుంటూరు: వృద్దురాలి హత్యకేసులో నిందితులు అరెస్ట్

పాత గుంటూరు ఆనందపేటలో వృద్ధురాలిని హత్య చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. అర్షద్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. ఆమె సోదరులను తన బావమర్దులని చెప్తున్నాడు. దీంతో బాలిక సోదరులు, అర్షద్ కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో బాలిక సోదరులు ఫైరోజ్, ఫయాజ్‌లు అర్షద్ అమ్మమ్మ ఖాజాబి(70)ని కొట్టడంతో ఆమె చనిపోయింది.
News April 8, 2025
GNT: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్

గుడివాడలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. `పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గాయ్స్.. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు’ అని X లో పోస్ట్ చేశారు.