News February 7, 2025
గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి
కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 7, 2025
పర్యాటక రంగం అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ధి: మంత్రి దుర్గేశ్
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేసి తమదైన ముద్రవేయాలని పర్యాటక శాఖ అధికారులకు మంత్రి కందుల దుర్గేశ్ దిశా నిర్దేశం చేశారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ 11వ ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు.
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. లోకేశ్‌కు 8వ ర్యాంకు
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో గుంటూరు జిల్లా మంత్రులు నాదెండ్ల మనోహర్ 4 ర్యాంకు రాగా, లోకేశ్‌కు 8వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.
News February 6, 2025
ANU: దూరవిద్యలో ఫైర్ సేఫ్టీ కోర్సులు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ విశాఖపట్నం మధ్య విద్యాసంబంధ సహకారాన్ని కొనసాగించడం కోసం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ.. అగ్ని భద్రత, అత్యవసర ప్రతిస్పందన సంబంధిత రంగాలలో ఎన్ఐఎఫ్ఎస్ గత 25ఏళ్ళుగా శిక్షణ ఇస్తుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల వలన ఉద్యోగాలు లభిస్తాయన్నారు.