News June 2, 2024

గుంటూరు: కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు

image

జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్, తెనాలి, వేమూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. నాలుగో తేదీ కౌంటింగ్ ముగిసే వరకు మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారు సహకరించాలన్నారు.

Similar News

News February 24, 2026

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలని తెలిపారు. రానున్న 3 రోజుల్లో ప్రోగ్రెస్‌ను మరింతగా పెంచేలా ఈఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ నిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తూ 100 శాతం పూర్తి చేయాలన్నారు.

News February 24, 2026

గుంటూరు: ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ.. నిందితులు వీరే..!

image

MLA ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. నిందితుల నుంచి 10కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు రికవరీ చేశామన్నారు. సత్తెనపల్లి రాకేష్, కొక్కిలిగడ్డ ఆశీర్వాదం దొంగతనానికి పాల్పడ్డారని, వీరిపై గతంలో 34కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 8మంది నిందితులను గుర్తించి, ఐదుగురిని అరెస్ట్ చేసామన్నారు.

News February 24, 2026

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా

image

గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను నెలవారీ తనిఖీల్లో భాగంగా గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన తాళాల సీల్, సీసీ కెమెరాల డిస్‌ప్లే, ప్రాంగణాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్ భద్రత విషయంలో రాజీ లేకుండా అవసరమైన అన్ని చర్యలు నిరంతరం పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.