News March 6, 2025
గుంటూరు: గుడారాల పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

గుంటూరు గుడారాల పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంటూరు డివిజన్ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే గుడారాల పండుగకు ఈనెల 5వ తేదీన ప్రత్యేక రైళ్లు గుంతకల్, రేణిగుంట, విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు చేరుకుంటాయి. తిరిగి 9న బయలు దేరుతుయని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News March 6, 2025
వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. బుధవారం మంత్రి సంధ్యారాణి మహిళా దినోత్సవ వేడుకలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మహిళా రక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను స్టాల్స్ రూపంలో అన్ని శాఖల వారు ఏర్పాటు చేయాలన్నారు.
News March 4, 2025
EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: లోకేశ్

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని మంత్రి లోకేశ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యమని అన్నారు. ఈ విజయం ఒక చరిత్ర అని అభివర్ణించారు.
News March 4, 2025
GNT: ‘వాలంటీర్’ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.