News August 13, 2025

గుంటూరు చరిత్రలో మర్చిపోలేని PHOTO ఇది

image

బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే గుంటూరులో 1947 ఆగస్టు 15వ తేదీన ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించారు. స్థానిక AC కళాశాలలో అదే రోజు జెండా ఎగురవేశారు. AC కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ నారాయణ తన మాటలతో ప్రజలను ఉత్సహ పరిచరారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు. ప్రముఖ వ్యక్తులు ప్రసంగించారు. పైన ఉన్నది అప్పటి ఫొటోనే.

Similar News

News August 14, 2025

గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

image

గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఫిరంగిపురం మండలంలో అత్యధికంగా 55.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుళ్లూరులో 41 మి.మీ, కొల్లిపర 27.5 మి.మీ, తాడికొండలో 27, గుంటూరు వెస్ట్ ప్రాంతంలో 25.75 మి.మీల వర్షపాతం నమోదైంది. మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో 22.5 మి.మీ, పొన్నూరు 19.5, దుగ్గిరాల 18, తెనాలి 15 మి.మీ చొప్పున వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

News August 14, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం సుమారు 55 వేల బస్తాల వరకు ఏసీ సరుకు చేరుకుంది. కేజీల వారిగా ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజ బెస్ట్: రూ. 80-120, తేజ ఏ/సి: రూ. 125-143, 355 ఏ/సి: రూ. 100-135 వరకు ఉంది. 2043 ఏ/సి: రూ. 120-135, 341 ఏ/సి: రూ. 120-150, షార్కు ఏ/సి: రూ. 110-130, నంబర్ 5 ఏ/సి: రూ. 125-142, డీడీ రకం ఏ/సి: రూ. 110-140, ఎల్లో రకం: రూ. 200-230, బుల్లెట్: రూ. 90-135 వరకు ధర లభించింది.

News August 14, 2025

గుంటూరులో నకిలీ నోట్ల ముఠా అరెస్టు

image

బాపట్ల వాసి బక్క గోపిని పట్టాభిపురం పోలీసులు నకిలీ నోట్లు మార్చుతుండగా అరెస్ట్ చేశారు. రత్నగిరి నగర్‌లో నివాసం ఉంటున్న గోపికి హైదరాబాద్‌కు చెందిన భరత్ ద్వారా కలకత్తా వాసి గోపాల్ పరిచయమయ్యాడు. గోపాల్ వద్ద నుంచి గోపి 160 నకిలీ రూ.500 నోట్లు కొనుగోలు చేసి గుంటూరులో మార్చుతున్నాడు. పోలీసులు అతడి వద్ద నుంచి 25 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించారు.