News February 11, 2025
గుంటూరు: చికిత్స పొందుతూ యువకుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739235991180_934-normal-WIFI.webp)
ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. వట్టిచెరుకూరు(M) లేమల్లెపాడుకి చెందిన సంజయ్(18) జనవరి 14న ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ నెల 5న మళ్లీ అనారోగ్యానికి గురి కాగా GGHకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. చెట్టంత కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Similar News
News February 11, 2025
వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739276164579_20442021-normal-WIFI.webp)
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.
News February 11, 2025
గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739251467265_20442021-normal-WIFI.webp)
పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 11, 2025
వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739243234661_20442021-normal-WIFI.webp)
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.