News February 17, 2025
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం

గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య మహిళలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడలు ఈ నెల 11 నుంచి ప్రారంభం

మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిన ఆల్‌ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఈ నెల 11, 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. కలెక్టర్ అనుమతితో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. నంద్యాలలో 11, 12న వివిధ క్రీడలు, కర్నూలులో 13న స్విమ్మింగ్ పోటీ ఉంటుందని తెలిపారు.
News November 5, 2025
ఇతిహాసాలు క్విజ్ – 57 సమాధానాలు

1. శబరి రాముడి కోసం ‘మాతంగి రుషి’ ఆశ్రమంలో ఎదురు చూసింది.
2. విశ్వామిత్రుడి శిష్యులలో శతానందుడు ‘గౌతముడి’ పుత్రుడు.
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ‘అలక’.
4. నారదుడు ‘వీణ’ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు.
5. కాలానికి అధిపతి ‘యముడు’. కొన్ని సందర్భాల్లో కాళిదేవి, కాళుడు అని కూడా చెబుతారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 5, 2025
ఏలూరు: చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

భీమడోలు, చేబ్రోలు, నిడమర్రు, గణపవరం, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. నిందితుల నుంచి 65 గ్రాముల పసిడి వస్తువులను రికవరీ చేశామన్నారు. వాటి విలువ రూ.6,50,000 ఉంటుందన్నారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ చూపిన పోలీసులను ఎస్పీ ప్రశంసించారు.


