News October 18, 2025

గుంటూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడులు

image

గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం శనివారం దాడులు నిర్వహించింది. పాత గుంటూరు PS పరిధిలో పేకాట ఆడుతున్న 10మందిని అదుపులోకి తీసుకుని, 10 సెల్ ఫోన్లు, ₹25,500 నగదు, 4 బైకులను సీజ్ చేశారు. అలాగే, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్మూలించడమే టాస్క్ ఫోర్స్ లక్ష్యమని ఎస్పీ అన్నారు.

Similar News

News October 18, 2025

లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలు చేయండి: కలెక్టర్

image

PC PNDT చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అల్ట్రా సౌండ్ క్లినిక్‌లు కలిగిన నర్సింగ్ హోమ్‌లు, ఇమేజింగ్ కేంద్రాలు, జెనెటిక్ మొబైల్ కేంద్రాలు, కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, సరోగసి క్లినిక్‌లు తదితర సంస్థలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News October 18, 2025

సూర్యఘర్ పథకం వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. SC, STలకు ఉచితంగా సోలార్ యూనిట్లు ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

News October 18, 2025

గుంటూరు: సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం తెలిపారు. దీపావళి సందర్భంగా సెలవు దినం కావడంతో పీజీఆర్‌ఎస్ జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.