News August 15, 2025

గుంటూరు జిల్లాలో ఫ్రీ బస్సు.. 302 బస్సులు కేటాయింపు

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. అయితే గుంటూరు జిల్లా పరిధిలోని 5 డిపోల్లో 302 బస్సులను స్త్రీ శక్తి పథకానికి కేటాయించినట్లు ఇన్‌ఛార్జ్ RM సామ్రాజ్యం చెప్పారు. ఫ్రీ బస్సు పథకానికి 302 బస్సుల్లో కేటాయించగా వాటిలో 241 పల్లె వెలుగు, 8 అల్ట్రా పల్లె వెలుగు, 53 ఎక్స్‌ప్రెస్ బస్సులను మహిళలకు అందుబాటులో ఉంచామని ఆమె వెల్లడించారు.

Similar News

News November 5, 2025

మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

image

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2025

అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.

News November 4, 2025

GNT: మోటార్ వాహనాలకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు

image

దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరుకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డీ.డీ దుర్గాబాయి తెలిపారు. వంద శాతం సబ్సీడీతో ఈ వాహనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. www.apdascac.ap.gov.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని తెలిపారు.