News April 3, 2025
గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్‌దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.
Similar News
News April 4, 2025
అమరావతికి మోదీ రాక.. ఏర్పాట్లు షురూ

అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో తుళ్లూరు DSP మురళీకృష్ణ, MRO సుజాత, సీఐలు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
News April 3, 2025
11వ తేదీలోగా అభ్యంతరాలు తెలపండి: డీఈవో

అర్హులైన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా సిద్ధమైంది. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్ సైట్‌లో ఉంచడం జరిగిందని డీఈవో రేణుక చెప్పారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీలోగా తెలపాలని సూచించారు. ఈ మేరకు డీఈవో రేణుక గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సాగుతుందన్నారు.
News April 3, 2025
గుంటూరు: వృద్ధురాలిపై కర్రలతో దాడి.. మృతి

గుంటూరు నగరంలోని ఆనందపేటలో రెండు వర్గాల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. పాత కక్షల నేపథ్యంలో హర్షద్ కుటుంబ సభ్యులపై ఫిరోజ్, ఫరోజ్‌తో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ ఖాజాబీ(75) మరణించింది. హర్షద్ తల్లిదండ్రులు షాజహాన్, బాబులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.