News April 28, 2024
గుంటూరు జిల్లాలో భారీగా నగదు, మద్యం పట్టివేత

జిల్లాలో ఆదివారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమలో 1.62 లీటర్ల మద్యం, పొన్నూరులో 7.2 లీటర్ల మద్యం, రూ.2,70 లక్షలు నగదు సీజ్ చేశామన్నారు. తెనాలి పరిధిలో రూ.2,21,100/-ల నగదు, తాడికొండ పరిధిలో రూ.1,20 లక్షలు, ప్రత్తిపాడు పరిధిలో రూ. లక్ష నగదు పట్టుకున్నామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 28వ తేదీ వరకు రూ.2,53,42,262/- విలువ గల మద్యం, నగదు సీజ్ చేశామన్నారు.
Similar News
News July 8, 2025
గుంటూరు: ఇసుక నిల్వలు సిద్ధం

గుంటూరు జిల్లాలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఇసుకను కృష్ణానదిలో నుంచి తరలించి స్టాకు పాయింట్లలో నిల్వ చేశారు. లింగాయపాలెం-1, 2, బోరుపాలెం, గుండిమెడలపైగా చౌడవరం, పెదకాకాని, ప్రాతూరులో మాన్సూన్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరదలతో మైనింగ్ ఆగినా ప్రజలకు ఇసుక కొరత తలెత్తదని సమాచారం. ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
News July 8, 2025
గుంటూరు మిర్చికి జాతీయ గుర్తింపు

ఓడీఓపీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన మిర్చిపై రూపొందించిన సమగ్ర నివేదికకు కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లా ఉద్యాన శాఖ ప్రణాళికా ఆధారంగా రూపొందించిన నివేదిక రాష్ట్ర స్థాయిలో ఎంపికై, దేశంలోని ఏడు ఉత్తమ నివేదికలలో స్థానం సంపాదించింది. జులై 14న ఢిల్లీలో కలెక్టర్ నాగలక్ష్మి అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News July 7, 2025
పేరెంట్స్-టీచర్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.