News September 24, 2025
గుంటూరు జిల్లాలో రెండు కీలక పదవులపై ఉత్కంఠ

గుంటూరు జిల్లాలో మిర్చి యార్డు ఛైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్ష పదవులు ఇంకా ఖాళీగానే ఉండటంతో నేతల్లో ఆసక్తి నెలకొంది. రూ.1000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగే యార్డు ఛైర్మన్ స్థానం ప్రతిష్టాత్మకమైందిగా భావించబడుతోంది. ఈ పీఠం కోసం పలువురు పోటీలో ఉన్నారు. మరోవైపు జిల్లా అధ్యక్ష బాధ్యతలు బీసీలకు ఇవ్వాలన్న ఆలోచనపై పార్టీ అధిష్ఠానం చర్చిస్తున్నట్లు సమాచారం. దసరా నాటికి ఈ రెండు పదవులపై స్పష్టత రానుంది.
Similar News
News September 24, 2025
కశ్మీర్ లోయలో ఫ్యాషన్ చుక్క ఇక్రా అహ్మద్

సంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా సత్తా చాటుతున్నారు కశ్మీర్‌కు చెందిన ఇక్రా అహ్మద్. ఆ రాష్ట్రంలో Tul Palav అనే తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను నెలకొల్పి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కుర్తాలు, వెడ్డింగ్ డ్రెస్సులతో ఆకట్టుకుంటున్నారు. లోయలో అస్థిర పరిస్థితులను తట్టుకుని, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.
News September 24, 2025
ఏడాదిలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం: కలెక్టర్

ఖమ్మం: సంవత్సరం కాలంలోనే కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెంలో ఆయన మాట్లాడుతూ.. కోల్డ్ స్టోరేజ్ కోసం అవసరమైన 10 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంతో స్థానిక రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఉద్యానవన పంటలు, మిర్చి పంటలను సాగు చేసే రైతులు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు.
News September 24, 2025
కొత్తగూడెం: 1258 మంది జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 1258 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరిస్తూ బుధవారం సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సంస్థలు బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తూ 190/240 మాస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరీ-1గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎండీ తెలిపారు.