News August 17, 2025
గుంటూరు జిల్లాలో రేపు వర్షం కురిసే ఛాన్స్

గుంటూరు జిల్లాలో సోమవారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే APSDMA చరవాణిలకు మెసేజ్‌లు పంపింది.
Similar News
News August 18, 2025
స్కూల్స్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి దరఖాస్తులు ఆహ్వానం: DEO

గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సి.వి. రేణుక తెలిపారు. 2025-27 సంవత్సరానికి సంబంధించి కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉన్న పీఈటీ/స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)లు ఈనెల 20లోపు deogunturblogspot.comలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News August 17, 2025
గుంటూరు: GGHలో వాహనాల చోరీకి చెక్

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాల చోరీ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని ద్వారా ఆసుపత్రి స్వాగతద్వారంలోనే వాహనంతో పాటూ సంబంధిత వాహన యజమానికి RFID ట్యాగ్ వేసి వాహనాల చోరీని అరికట్టనున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.