News September 27, 2025

గుంటూరు జిల్లాలో వర్షం

image

వాయువ్య,దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, ఉందని తెలిపారు. శనివారం గుంటూరు, పల్నాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

Similar News

News September 27, 2025

తుళ్లూరు: 97 మందికి రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

image

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని CRDA కార్యాలయంలో ఈ- లాటరీ విధానంలో 97 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు మొత్తం 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులున్నారు.

News September 27, 2025

అతిసార వ్యాధి నియంత్రణలో ఉంది: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని కలెక్టర్ ఎం. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 177 కేసులు నమోదయ్యాయని, వాటిలో 152 కేసులు గుంటూరు పట్టణం నుంచి, 25 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని ఆమె వివరించారు. ఈ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.

News September 27, 2025

అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం

image

అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభానికి రంగం సిద్ధం చేయనున్నారు. క్యాంపస్ కోసం నామమాత్రపు లీజుకు (₹1/చ.మీ) 55 ఎకరాలు కేటాయించారు. AP విద్యార్థులకు 20% సీట్లు రిజర్వు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు ఉంటాయని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కింద నడుస్తుంది. అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టారు.