News September 19, 2025

గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

image

గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. మొత్తం మీద సగటు వర్షపాతం 4.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెదనందిపాడు మండలం 15.6 మి.మీ.తో అగ్రస్థానంలో ఉండగా, తుళ్లూరులో కేవలం 1.8 మి.మీ. మాత్రమే పడింది. మంగళగిరి 9.8, తాడికొండ 9.6, కాకుమాను 9.4, చేబ్రోలు 9.2, గుంటూరు పశ్చిమ 9.2, తాడేపల్లిలో 8.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు కొంత ఊరట పొందారు

Similar News

News September 19, 2025

తాగునీటిలో మురుగునీరు కలవడంతోనే సమస్య: సీపీఎం

image

గుంటూరులో డయేరియా వ్యాప్తిపై సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీటి కారణంగానే ఈ సమస్య తలెత్తిందని, అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌లో డయేరియా రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే 33 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షాలకు మురుగు నీరు తాగునీటి పైపుల్లో కలిసి ప్రజలకు సరఫరా అవుతోందని ఆరోపించారు.

News September 19, 2025

సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News September 18, 2025

నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.