News July 15, 2024
గుంటూరు జిల్లాలో 110 పోస్టల్ ఉద్యోగాలు
10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గుంటూరు డివిజన్లో 29, తెనాలి డివిజన్లో 28, నరసరావుపేట డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ABPM అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT.
Similar News
News November 29, 2024
గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్
బోరుగడ్డ అనిల్‌కు మరో 14 రోజులు రిమాండ్‌ను గుంటూరు జిల్లా కోర్టు పొడిగించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర దూషణలపై కేసులో బోరుగడ్డ అనిల్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు పట్టాభిపురం పోలీసులు తరలించారు. కాగా ఇప్పటికే అనిల్ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.
News November 29, 2024
రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అమరావతి ప్రాంతంలో గతంలో పలు భూకేటాయింపులపై సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేశ్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
News November 29, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.