News November 11, 2024

గుంటూరు జిల్లాలో 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్: కలెక్టర్

image

రాష్ట్ర బాలల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం కానుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్ నాగలక్ష్మి , జేసీ భార్గవ్ తేజ‌ ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి ఎదుగుదల లోపాలను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు‌.

Similar News

News November 14, 2024

పెదకాకాని: దారుణం.. బాలికపై చిన్నాన్న అఘాయిత్యం.!

image

పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో తండ్రి లేని ఓ మైనర్ బాలిక ఇంటి దగ్గరే ఉంటోంది. అదే గ్రామంలో నివసిస్తున్న చిన్నాన్న మొగులూరి శామ్యూల్ ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకొని 8 నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలికకు నెలసరి రాకపోవడంతో తల్లి డాక్టర్‌కు చూపించగా 3వ నెల గర్భిణిగా నిర్ధారించారు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

News November 14, 2024

నరసరావుపేట: పోసానిపై మరో ఫిర్యాదు

image

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు పోసానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా TDP ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఆలీభాష డిమాండ్ చేశారు. కాగా బాపట్లో పోసానిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News November 13, 2024

పెదకాకానిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

పెదకాకాని మండలంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పర్యటించారు. మండల కేంద్రంలోని గౌడపాలెం అంగన్వాడీని సందర్శించి ఇంకుడు గుంట ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలోని వసతులు, విద్య, టాయిలెట్లు, ఆహార పదార్థాలు, వాటి నాణ్యత గురించి అంగన్వాడీ టీచర్, ఆయాలను అడిగి తెలుసుకున్నారు. పెదకాకాని మండలంలోని పుష్పరాజ్ కాలనీ సీసీ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.