News December 29, 2024

గుంటూరు జిల్లాలో 16 శాతం క్రైమ్ రేటు తగ్గింది: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీశ్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16 శాతం క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 224 మందిని గంజాయి కేసుల్లో పట్టుకొని 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు.  

Similar News

News January 1, 2025

నిజాంపట్నం: భర్తను హత్య చేసిన భార్య

image

భర్తను భార్య హత్య చేసిన దారుణ ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో భర్త అమరేంద్ర (38) తలపై భార్య కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె రూరల్ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 1, 2025

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నూతన సంవత్సరం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి రక్తమోడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు మార్టూరు వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహిళను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 1, 2025

పల్నాడు: కొత్త సంవత్సరం వేళ కుటుంబంలో తీవ్ర విషాదం

image

నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమారుడికి కేక్ కొనిచ్చేందుకు తీసుకెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద విషాదాంతమిది. గ్రామానికి చెందిన దుర్గారావు బైక్‌పై కుమారుడితో కలిసి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.