News October 28, 2025

గుంటూరు జిల్లా ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

గుంటూరు మీదు నవంబర్‌లో పలు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-అనకాపల్లి రైలు (07055) నవంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం, తిరుగు రైలు (07056) నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. కాకినాడ-మైసూరు రైళ్లు (07033, 07034) నవంబర్ 3 నుంచి 29 వరకు నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా ప్రయాణిస్తాయి. అదనంగా నవంబర్ 13, 14 తేదీల్లో యలంక-అనకాపల్లి రైళ్లు కూడా నడవనున్నాయి.

Similar News

News October 28, 2025

కర్నూలు: బస్సు ప్రమాదం కేసులో డ్రైవర్ అరెస్ట్.!

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాదం కేసులో వి.కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పత్తికొండ DSP వెంకట్రామయ్య పర్యవేక్షణలో విచారణ జరిపి, నిందితుడిని మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా SP విక్రాంత్ పాటిల్ తెలిపారు.

News October 28, 2025

ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్‌కు యత్నం.. కేసు నమోదు

image

బాలుడి కిడ్నాప్ యత్నం కేసును నమోదు చేశామని వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. యూపీలోని ఫైజాబాద్‌కు చెందిన రాహుల్ అనే యువకుడు ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో ఒక బాలుడిని అపహరించే యత్నం చేస్తుండగా కాలనీకి చెందిన షేక్ హసన్‌తోపాటు కొందరు పట్టుకున్నారని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారన్నారు. నిందితుడు తన పేరును సలీం, సల్మాన్ పేర్కొనగా ఆధార్ కార్డు పరిశీలించగా రాహుల్‌గా గుర్తించామన్నారు.

News October 28, 2025

ముత్తారం: ఇంటర్మీడియట్‌ నోడల్‌ ఆఫీసర్‌ తనిఖీలు

image

ముత్తారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ నోడల్‌ ఆఫీసర్‌ డీ.కల్పన మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పరిసరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల హాజరు శాతం, యూనిట్‌ టెస్ట్‌ మార్కుల వివరాలపై ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, మార్కులు ఎక్కువ వచ్చేలా కృషి చేయాలన్నారు. అధ్యాపకుల టీచింగ్‌ విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.