News October 9, 2025

గుంటూరు జిల్లా రోడ్లకు ఊపిరి..!

image

రాబోయే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గుంటూరు జిల్లా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అమరావతి మార్గం సహా తెనాలి–మంగళగిరి, గుంటూరు–హనుమాన్‌పాలెం రహదారుల మెరుగుదలకు రూ.11 కోట్ల పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. అదనంగా తొమ్మిది ప్రధాన ఎండీఆర్ రోడ్ల అభివృద్ధికి రూ.31 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. రహదారులు సక్రమంగా తయారైతే పుష్కరాల సమయంలో రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.

Similar News

News October 9, 2025

తెనాలి: ‘మావు’లకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు.!

image

కాలువల్లో చేపల వేటకు ఉపయోగించే వెదురు ‘చేపల మావుల’ తయారీలో తెనాలి సమీప ఆలపాడు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి చేపల మావులు అనగానే ముందుగా గుర్తొచ్చేది చుండూరు మండలం ఆలపాడు గ్రామమే. నాణ్యమైన మన్నికైన చేపల మావులు కోసం అనేక మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకు వెళుతుంటారు. ఇక్కడ చాలా కుటుంబాలు వ్యవసాయ పనులతో పాటు వీటి తయారీ వృత్తిపైనే ఆధారపడ్డాయి.

News October 9, 2025

బాణాసంచా విక్రయాలకు పర్మిషన్ తీసుకోవాలి: కలెక్టర్

image

దీపావళి పండగకు బాణాసంచా విక్రయించే షాపుల అనుమతులకు అక్టోబర్ 17 లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 20న దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకొనుటకు ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 9, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం మొత్తం 75,000 బస్తాల A/C సరకు వచ్చింది. మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉన్నా, కొన్ని రకాల ధరలు ఆకర్షణీయంగా పలికాయి. పసుపు రకం మిర్చి ధర కిలోకు ₹200 నుంచి ₹250 వరకు అత్యధికంగా నమోదైంది. తేజా A/C రకం ధర కిలోకు ₹100 నుంచి ₹152 వరకు పలికింది. 341 A/C రకం గరిష్ఠంగా ₹165కి చేరుకుంది. నాటు రకాలైన 334, సూపర్ టెన్ రకాలు కిలోకు ₹90 నుంచి ₹155 వరకు ట్రేడ్ అయ్యాయి.