News March 27, 2025

గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

image

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు. 

Similar News

News March 30, 2025

తుళ్లూరు: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం 

image

ఏపీలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పీ-4 కార్యక్రమం ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. కార్యక్రమంలో దాదాపు 14వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరిగాయి. 

News March 30, 2025

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివానం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు రాష్ట్ర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

News March 30, 2025

పేద కుటుంబాలను ఆదుకునేందుకు తొలి సంతకం చేసిన సీఎం

image

పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రూ.38కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు రూ.281.38కోట్లను ప్రభుత్వం అందించింది. 

error: Content is protected !!