News July 26, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

* సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ బైక్‌ దహనం
* తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
* వినుకొండ: రషీద్ హత్య.. నిందితులకు 30 ఏళ్ల లోపే!
* పల్నాడులో ఆగని టీడీపీ దాష్టీకాలు: వైసీపీ
* గుంటూరు: అమరులైన వీర జవానులకు నివాళి
* వినుకొండ హత్యపై మరోసారి స్పందించిన జగన్
* అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఐ
* అమెరికాలో మృతి.. తెనాలి చేరుకున్న రవితేజ మృతదేహం

Similar News

News February 18, 2026

గుంటూరు: సిగరెట్ ధరల పెరుగుదల.. వినియోగదారులకు భారం

image

కేంద్ర బడ్జెట్‌లో పన్నులు పెరగడంతో గుంటూరు జిల్లాలో సిగరెట్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. GST, ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో ప్యాకెట్ల ధరలు రూ.20 నుంచి రూ.50వరకు అధికమయ్యాయి. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఇంకా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణానికో రేటు ఉండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ చర్యలతో ధూమపానం తగ్గించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

News February 18, 2026

మంగళగిరి-తెనాలి రోడ్డు విస్తరణ

image

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్‌కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.

News February 17, 2026

ఉగాది నాటికి గృహ నిర్మాణాలే లక్ష్యం: కలెక్టర్

image

ఉగాది నాటికి నిర్దేశిత గృహ లక్ష్యాలు పూర్తిచేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనులపై కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, MPDOలతో కలెక్టర్ వీసీ నిర్వహించారు. జిల్లాలో 22,952 గృహాలు పూర్తి చేయాలని అన్నారు. దీనిని పూర్తి చేయుటకు మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు శ్రద్ధ పెట్టాలన్నారు.