News March 1, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

★ గుంటూరు జిల్లా 143 కోట్ల నిధులు: కేంద్ర మంత్రి పెమ్మసాని★ ఈ రోజు నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు: ఎస్పీ★ గుంటూరు జిల్లా పెన్షన్ల పంపిణీ★ గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పథకాలు★ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా మొదటి రోజు ఇంటర్ పరీక్షలు★ మంగళగిరి: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ దంపతులు★ ఏమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్
Similar News
News March 3, 2025
పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఉమ్మడి కృష్ణా ,గుంటూరు జిల్లా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం చెప్పారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 700 మంది స్టాఫ్ మూడు షిఫ్టులుగా కౌంటింగ్‌లో పాల్గొంటారని, వారికి ట్రైనింగ్ పూర్తయిందన్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు.
News March 2, 2025
గుంటూరులో పెరిగిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ వదంతుల నేపథ్యంలో రెండు వారాలు గుంటూరులో రూ.100 కి అమ్ముడైన చికెన్ ధర పుంజుకుంది. స్కిన్ రూ.130, స్కిన్ లెస్ రూ.150, కాల్చింది రూ.140గా విక్రయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మాంసంపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఇక మటన్ విషయానికి వస్తే రూ.950 నుంచి రూ.1,000 వరకు విక్రయాలు జరుగుతున్నాయి.
News March 2, 2025
GNT: రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.