News August 21, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

☞ కొండవీటి వాగు డ్రోన్ విజువల్స్.
☞ గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్.
☞ తెనాలి: యువకుడిని బెదిరించి దారి దోపిడీ.
☞ గంజాయి కేసులో 14 మంది అరెస్ట్.
☞ తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం.
☞ మంగళగిరి: మంగళగిరిలో పొల్యూషన్ బోర్డు తనిఖీలు.
☞ పొన్నూరు: పోలీసుల విచారణకు హాజరైన అంబటి మురళీ.
☞ డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO.
Similar News
News August 21, 2025
గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్

గంజాయి తరలిస్తూ విశాఖపట్నం (D) కంచరపాలెం పోలీసులకు గుంటూరు(D)కు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. వీరిలో ఓ యువతి కూడా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 12న సుభాష్ నగర్ వద్ద కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి మృతిచెంది. పోలీసులు కారు సీజ్ చేశాక తనిఖీ చేస్తున్న సమయంలో 21 కిలోలు గంజాయి కారులో గుర్తించారు. కేసు నమోదు చేసి గుంటూరు జిల్లాకు చెందిన అక్షయ గౌతమి, బాపట్లకు చెందిన మహమ్మద్ జాకీర్‌ను అరెస్ట్ చేశారు.
News August 21, 2025
తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం

ప్రజలు సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు, కానీ గుంటూరు జిల్లాలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే ఏకంగా పోలీస్ సిబ్బందే భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ స్టేషన్ పరిధిలో సచివాలయం, హైకోర్టు ఉండటం వల్ల ఇక్కడ విధులు నిర్వహించడం అంటే వెట్టిచాకిరితో సమానమని అంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో కేవలం 10% మాత్రమే HRA వస్తుందని, చుట్టుపక్కల స్టేషన్లలో 16% వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.
News August 21, 2025
డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO

గుంటూరు జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడీల క్రియేషన్‌లో వెనుకబడి ఉన్నాయని DMHO విజయలక్ష్మీ అన్నారు. గురువారం పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆమె సూచించారు.