News August 28, 2025

గుంటూరు జిల్లా TOP NEWS TODAY

image

☞ లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి
☞ ఐకానిక్ టవర్ల నుంచి నీరు తోడివేత 
☞ గుంటూరు: రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం
☞ చిలకలూరిపేటలో అమెరికన్ డైమండ్స్‌తో వినాయక విగ్రహం
☞ పులిచింతల వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
☞ మిస్సింగ్ కేసులను ఛేదించాలి: ఎస్పీ
☞ ఈవీఎంల భద్రత పక్కాగా ఉండాలి : కలెక్టర్
☞ అంబటి మురళీ ధూళిపాళ్లపై బురద జలుతున్నారు
☞ మంగళగిరిలో ఫోన్ దొంగల అరెస్ట్

Similar News

News August 29, 2025

GNT: నేడు డీఎస్సీ అభ్యర్థులకు మెడికల్ బోర్డు పరీక్ష

image

మెగా డీఎస్సీ-2025 ధృవపత్రాల పరిశీలనకు వచ్చిన విభిన్న ప్రతిభావంతులు మెడికల్ బోర్డు పరీక్షకు హాజరు కావాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి. రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్ష జరుగుతుందని ఆమె చెప్పారు. సామర్థ్య పరీక్ష నిమిత్తం ఒక్కో అభ్యర్థి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు.

News August 28, 2025

హరిత నగరంగా అమరావతి

image

అమరావతిలో గ్రీనరీ అభివృద్ధి పనులను APCRDA, ADCL లు ప్రణాళికాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. పర్యాటకం, పర్యావరణ పరిరక్షణలతో కూడిన అనేక ప్రాజెక్టులను చేపట్టి, అమరావతిని భవిష్యత్తు తరాలకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే దిశగా సమగ్ర కృషి జరుగుతోంది. 4,716 హెక్టార్ల విస్తీర్ణంలో అమరావతిలో పర్యాటక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వం, వినోదానికి కేంద్రంగా నిలుస్తుంది.

News August 28, 2025

మిస్సింగ్ కేసులను చేధించాలి: GNT ఎస్పీ

image

పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను వెంటనే అమలు చేయాలని ఎస్పీ సతీశ్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన జులై నెలకు సంబంధించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, శారీరక దాడులకు సంబంధించిన కేసుల్లోని నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను అమలు చేయాలన్నారు. మిస్సింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.