News May 23, 2024

గుంటూరు: జూన్ 1 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ సప్లమెంటరీ పరీక్షలు

image

జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ‌‌ ప్రకటన విడుదల చేశారు. సప్లమెంటరీ పరీక్షలు కోసం విద్యార్థులు జిల్లా కో – ఆర్డినేటర్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా https://www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

అమరావతిలో సీజేఐ పర్యటనకు పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

భారత ప్రధాన న్యాయమూర్తి అమరావతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో శంకుస్థాపన వేదికలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని అధికారులకు ఆమె స్పష్టం చేశారు.

News February 27, 2026

రేపటితో ముగియనున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్

image

గుంటూరులో ముప్పై ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ ప్రదర్శనకు ఇప్పటివరకు సుమారు 80 వేల మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సందర్శించి అభినందించారు. చివరి రోజున ప్రజలు తప్పక వీక్షించాలని ప్రిన్సిపల్ డా. సుందరాచారి కోరారు. మరుపురాని వైద్య విజ్ఞాన అనుభూతిని పొందినట్లు పలువురు సందర్శకులు పేర్కొన్నారు.