News May 30, 2024

గుంటూరు: జూన్ 3 నుంచి మద్యం షాపులు మూసివేత

image

జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి జిల్లాలోని మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి ఓట్ల. లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. 

Similar News

News September 29, 2024

హోంమంత్రి అనిత డిక్లరేషన్ ఇచ్చారా.?: అంబటి

image

‘హోంమంత్రి శ్రీమతి అనిత గారు శ్రీవారి దర్శనానికి వెళ్లారు డిక్లరేషన్ ఇచ్చారా? లేదా?’ అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లాలని హోంమంత్రి అనితతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అంబటి తనదైన శైలిలో స్పందించారు. డిక్లరేషన్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.

News September 29, 2024

TDP MLC అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్.. నేడే అనౌన్స్?

image

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల TDP ఎమ్మెల్సీ అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు టీడీపీ అధిస్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. తెనాలి MLA టికెట్ కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో ఆ సీటును ఆలపాటి త్యాగం చేశారు. అందుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రతిఫలంగా దక్కుతోంది. ఆలపాటి గతంలో మూడు సార్లు MLAగా గెలిచారు. కాగా 1999లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

News September 29, 2024

గుంటూరు: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.