News August 7, 2025

గుంటూరు: టీబీ శాఖలో ఖాళీలపై మెరిట్ జాబితా విడుదల

image

టీబీ శాఖలో NHM – NTEP ప్రాజెక్ట్ కింద ఖాళీగా ఉన్న ఐదు పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలైంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తగిన ధ్రువ పత్రాలతో కలిపి ఆగస్టు 7 నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు DM&HO కార్యాలయంలో సమర్పించవచ్చు. అనంతరం వచ్చిన అభ్యంతరాలు స్వీకరించబడవు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో https://guntur.ap.gov.in చూసుకోవచ్చని DMHO డా.విజయలక్ష్మి తెలిపారు.

Similar News

News August 30, 2025

గుంటూరు జిల్లా బార్లకు వేలంపాట

image

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో శనివారం బార్లకు వేలంపాట నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 బార్లకు దరఖాస్తులు అందాయని, 10 కల్లుగీత కార్మికులకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. వేలంలో సుమారు 200 మంది పాల్గొన్నారు.

News August 30, 2025

గుంటూరు: MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ రిలీజ్‌

image

ANUలో 2025విద్యా సంవత్సరానికి MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ విడుదలైంది. MBAకి ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరి. ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, బ్యాంకింగ్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, టూరిజం, బిజినెస్‌ ఎనాలిటిక్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌ వంటి 8 స్పెషలైజేషన్‌లలో రెండింటిని మాత్రమే ఎంచుకోవాలి. MCAకి మ్యాథ్స్‌ అర్హత తప్పనిసరి. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21న ఉంటుంది.

News August 30, 2025

గుంటూరు యువకుడికి బంగారు పతకాలు

image

కజకిస్థాన్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు యువకుడు నేలవల్లి ముఖేష్ సత్తా చాటాడు. జూనియర్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ముఖేష్, 3 టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు, ఒక వ్యక్తిగత కాంస్య పతకం సాధించాడు. అతని అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో మెరుగైన స్థానాన్ని పొందింది.