News August 29, 2025
గుంటూరు: తెలుగు భాషా సేవకుడు కొండా వెంకటప్పయ్య

తెలుగు భాషా సేవకుడు కొండా వెంకటప్పయ్య గుంటూరు జిల్లాకు చెందినవారే. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమానికి ఆద్యుడిగా పేరొందారు. తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసిన ఆయన.. 1902లో మొదటి తెలుగు వార్తాపత్రిక ‘కృష్ణా పత్రిక’ను ప్రారంభించారు. 1913లో రాష్ట్రసాధన కోసం ఏర్పడిన ఆంధ్ర మహాసభలో కీలకపాత్ర పోషించారు. తెలుగు ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఏర్పడిన రాయబార వర్గానికి నాయకత్వం వహించారు.
Similar News
News August 29, 2025
అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: SP

కురిసిన కుండ పోత వర్షాలకు ముంపునకు గురైన బాధితులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నిజాంసాగర్ మండలం గోర్గల్‌లోని రైతు వేదికలో బాధితులతో ఆయన మాట్లాడారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విపత్తు నిర్వహణ బృంద సభ్యులకు కలిసి అభినందించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు.
News August 29, 2025
ADB: పంచాయతీ ఎన్నికలపై ఆల్ పార్టీ మీటింగ్

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, నియమావళిని వివరించి పలు సూచనలు చేశారు. సమావేశంలో JC శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ ఉన్నారు.
News August 29, 2025
బ్రాంకో టెస్ట్‌కు రోహిత్ సిద్ధం.. ఎప్పుడంటే?

యోయో, బ్రాంకో టెస్టుల్లో పాసయ్యేందుకు టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తన ట్రైనర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో జిమ్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నారు. ఎలాగైనా ఈ టెస్టులు నెగ్గాలనే కృతనిశ్చయంతో హిట్‌మ్యాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 13వ తేదీన రోహిత్‌కు బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ యోయో, బ్రాంకో టెస్టు నిర్వహిస్తుందని సమాచారం.