News January 21, 2025
గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 362 మంది ఉత్తీర్ణత
గుంటూరు పోలీస్ కవాత్ మైదానంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో సోమవారం 362 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 680 మంది అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ధృవపత్రాలు సక్రమంగా లేకపోవడంతో 102 మంది ఆరంభంలోనే వెనుదిరిగారు. చివరికి 578 మంది అభ్యర్థులకు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహించగా 362 మంది ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత పొందారు. ఎస్పీ సతీశ్ కుమార్, అదనపు ఎస్పీలు పర్యవేక్షించారు.
Similar News
News January 21, 2025
హౌసింగ్ లే అవుట్స్ లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్
హౌసింగ్ లే అవుట్స్‌లో ప్రతీవారం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులు సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు అందించేలా చూడాలని చెప్పారు.
News January 21, 2025
పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ
మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. పోలీస్ శాఖ తరఫున అడిషనల్ కార్పస్ ఫండ్ పథకం కింద ఏఎస్ఐ అరుణాచలం కుటుంబ సభ్యులకు రూ.1లక్ష చెక్కును ఎస్పీ అందజేశారు. అలాగే ఏఆర్ఎస్ఐ మాణిక్యరావు కుటుంబ సభ్యులకు కూడా రూ.1లక్ష చెక్కును అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాగోగులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
News January 20, 2025
23న విద్యార్థులకు పోటీలు: DEO
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘nothing like voting, 1 vote for sure’ అనే అంశంపై ఈనెల 23న వ్యాసరచన, వక్తృత్వ, స్లోగన్ రైటింగ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం తెలిపారు. పాత బస్టాండ్ వద్దనున్న ఉర్థూ బాలుర పాఠశాలలో ఉదయం 9.30గంటలకు పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 25న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.