News May 10, 2024
గుంటూరు: దోశలో ఇనుప బోల్ట్

గుంటూరులోని ఓ హోటల్లో దోశలో ఇనుప బోల్ట్ రావడంతో ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. గురువారం ఓ వ్యక్తి మిత్రులతో కలిసి కొరిటెపాడులోని ఓ హోటల్‌కు వెళ్లారు. దోశ ఆర్డర్ చేసి తింటుండగా అందులో ఇనుప బోల్ట్ వచ్చింది. ఈ విషయం హోటల్ నిర్వాహకులను అడిగితే పట్టించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఆహార భద్రత నియంత్రణ శాఖ అధికారులకు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 22, 2025
తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అమరావతి

అమరావతిని ప్రపంచంలో తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా చర్యలు వేగవంతం చేశారు. 2050 నాటికి 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో 1/3 పైకప్పు సోలార్ ప్యానెల్లకు కేటాయించనున్నారు. ప్రభుత్వ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు సోలార్ తప్పనిసరి. ఇప్పటికే 415 కిలోవాట్ల సోలార్ ప్యానెల్లు 16 కేంద్రాల్లో ఏర్పాటు అయ్యాయి.
News April 22, 2025
దొంగల కదలికల భయంతో నిద్రలేని గ్రామం

పెదనందిపాడు మండలానికి చెందిన పరిటలవారిపాలెం గ్రామంలో రెండు రోజులుగా దొంగల కదలికలతో గ్రామస్థులు భయంతో గడుపుతున్నారు. రాత్రివేళల్లో ఇంట్లోకి చొరబడి దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని రాత్రి వేళ కాపలా కాశారు. పోలీసుల గ్రామానికి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.
News April 22, 2025
అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష

వచ్చే నెల 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు.. సోమవారం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రాంగణం, రహదారి అభివృద్ధి, భద్రత ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రధాని బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేశారు.