News April 25, 2024

గుంటూరు: నిన్న నామినేషన్ వేయలేకపోయిన అంబటి మురళీ

image

పొన్నూరు YCP అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ మంగళవారం నామినేషన్ వేయలేకపోయారు. నిన్న ఉదయం ఆయన పెదకాకాని మండలం నంబూరు నుంచి వైసీపీ శ్రేణులతో ర్యాలీగా బయల్దేరారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో నామినేషన్ సమయం దాటిపోయింది. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 వరకే నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ, ఆయన పొన్నూరు మున్సిపల్ కార్యాలయానికి కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో మురళీ బుధవారం నామినేషన్ వేయనున్నారు.

Similar News

News April 21, 2025

నేడు గుంటూరులో చెక్కుల పంపిణీ

image

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణలో భాగంగా భూ సేకరణకు అంగీకరించిన యజమానులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై యజమానులకు నష్టపరిహారం చెక్కులను అందజేస్తారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

News April 20, 2025

కొల్లిపర: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

కొల్లిపర మండలం గుడిబండి వారిపాలెంకి చెందిన గుంటూరు రత్న కుమారి (22) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొల్లిపరలోని గవర్నమెంట్ హాస్పటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ సుప్రియ నిర్ధారించారు. తెనాలి సీఐ ఆర్.ఉమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : DEO

image

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.

error: Content is protected !!