News August 6, 2025
గుంటూరు: పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూపు

గుంటూరు పార్లమెంట్ పరిధిలో TDP పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గ్రామ పార్టీ అధ్యక్ష పదవులు పలుచోట్ల పూర్తికాగా కొన్నిచోట్ల ఎదురుచూస్తున్నారు. మండల అధ్యక్షుడి పదవితో పాటు, పార్టీ విభాగాలకు సంబంధించిన పదవుల కోసం కూడా పలువురు పోటీ పడుతున్నారు. మహానాడు అయ్యాక పదవులు కేటాయిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురైంది. ఇప్పటికీ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చేస్తూనే ఉన్నారు.
Similar News
News August 30, 2025
గుంటూరు జిల్లా బార్లకు వేలంపాట

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో శనివారం బార్లకు వేలంపాట నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 బార్లకు దరఖాస్తులు అందాయని, 10 కల్లుగీత కార్మికులకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. వేలంలో సుమారు 200 మంది పాల్గొన్నారు.
News August 30, 2025
గుంటూరు: MBA, MCA ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్

ANUలో 2025విద్యా సంవత్సరానికి MBA, MCA ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. MBAకి ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్ తప్పనిసరి. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, బ్యాంకింగ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, టూరిజం, బిజినెస్ ఎనాలిటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి 8 స్పెషలైజేషన్‌లలో రెండింటిని మాత్రమే ఎంచుకోవాలి. MCAకి మ్యాథ్స్ అర్హత తప్పనిసరి. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21న ఉంటుంది.
News August 30, 2025
గుంటూరు యువకుడికి బంగారు పతకాలు

కజకిస్థాన్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు యువకుడు నేలవల్లి ముఖేష్ సత్తా చాటాడు. జూనియర్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ముఖేష్, 3 టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు, ఒక వ్యక్తిగత కాంస్య పతకం సాధించాడు. అతని అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో మెరుగైన స్థానాన్ని పొందింది.