News September 11, 2025
గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మి, అరుణ్ కుమార్ బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లాకు నూతన కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్ల నియమితులయ్యారు. తమీమ్ అన్సారియా ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, కృతికా శుక్ల గతంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News April 14, 2026
జగిత్యాల: భవన నిర్మాణ కూలీగా ప్రభుత్వ టీచర్

11 ఏళ్లు వీఆర్‌ఏగా పనిచేసిన JGTL(D) కొడిమ్యాల (M) చెప్యాలకు చెందిన లక్ష్మీరాజం, ఉపాధ్యాయుడిగా ఎంపికై ఎనిమిది నెలలకే ఆ కొలువు కోల్పోయారు. ఆర్‌సీఐ వెరిఫికేషన్ సమస్యతో అధికారులు ఆయన్ను తొలగించడంతో, ప్రస్తుతం కుటుంబ పోషణకు భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. అటు పాత ఉద్యోగం లేక, ఇటు టీచర్ కొలువు పోయి రోడ్డున పడ్డానని, తనకు న్యాయం చేయాలని ఆయన సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నారు.
News April 14, 2026
ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.
News April 14, 2026
చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.


