News September 20, 2025

గుంటూరు: పీజీ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను అధికారులు శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఎమ్మెస్సీ బోటనీ, కంప్యూషనల్ డేటా సైన్స్, ఎంఏ హిస్టరీ, ఆర్కియాలజీ, మహాయాన బుద్ధిస్ట్, ఎంబీఏ మీడియా మేనేజ్‌మెంట్ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ https://kru.ac.in/ సందర్శించాలని అధికారులు సూచించారు.

Similar News

News September 21, 2025

NGKL: హోంగార్డ్స్ అందరికీ ఉలెన్ జెర్సీ & రైన్ కోట్స్ పంపిణీ

image

జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 117 మంది హోంగార్డ్ సిబ్బందికి ఉలన్ జెర్సీ, రైన్ కోట్ పంపిణీ చేసిన ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. వరదల సమయంలో వారు చేసిన సేవలను కొనియాడారు. ఉత్తమంగా నిబద్ధతతో పనిచేసే జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా హోంగార్డ్ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

News September 21, 2025

HYD: సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ధ్వంసం

image

మాదకద్రవ్యాల మాఫియాకు సైబరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. రూ.25.30 కోట్ల విలువైన 1,858 కిలోల మాదకద్రవ్యాలను ఈరోజు ధ్వంసం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కమిషనరేట్ చేపట్టిన 7వ దశ చర్య ఇది అని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి పర్యవేక్షణలో డీసీపీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో 316 కేసులకు సంబంధించిన ఈ డ్రగ్స్‌ను పర్యావరణ నిబంధనల ప్రకారం దహనం చేశారు.

News September 20, 2025

కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

image

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.